Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువే : కమల్ హాసన్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:34 IST)
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను తొలి తీవ్రవాదిగా ఆయన అభివర్ణించారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 18వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులోభాగంగా ఆయన కరూరు జిల్లా అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది ఓ హిందువని, అతడే మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్‌గాడ్సే అని వ్యాఖ్యానించారు. 
 
ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి తాను ఈ మాట చెప్పడం లేదన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిలబడ్డాను కాబట్టే ఈ విషయం గురించి మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఓ హిందువు. అతడే నాథూరామ్ గాడ్సే. అక్కడి నుంచే తీవ్రవాదం మొదలైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గాంధీజీకి మనుమడి వంటివాడినని, ఆయన హత్యపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు కోరేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. నిజమైన భారతీయులు త్రివర్ణ పతాకంలోని రంగులను, వాటి వెనుక ఉన్న విశ్వాసాలను చెక్కుచెదురకుండా కాపాడుకుంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments