Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ ఉత్సవాల్లో అపశృతి - కూలిన క్రేన్.. నలుగురి మృతి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (12:48 IST)
తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయ వేడుకల్లో జరిగిన ఈ అపశృతిలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆలయ విగ్రహాలకు భారీ పూలమాలలను వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు. మరో కొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
రాణిపేట జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయంలో ప్రతి యేటా వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా, ఆదివారం రాత్రి ఆలయ ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ విగ్రహాలకు భారీ క్రేన్‌పై ఉంచి పూజారులు, ఆలయ సిబ్బందితో పాటు మొత్తం ఎనిమిది మంది క్రేన్‌పైకెక్కారు. వీరు ఉత్సవ మూర్తులకు పూలమాలలు వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. 
 
క్రేన్ బాగా ఎత్తుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాణిపేట జిల్లా ఎస్పీ దీపా సత్యన్ వెల్లడించారు. నిజానికి ఆలయ వేడుకల్లో క్రేన్‌ను ఉపయోగించేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని అందుకే క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments