Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగల్లో కరెన్సీ నోట్లు... విలువెంతో తెలుసా? రూ.45లక్షలు!

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (17:41 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీ విమానాశ్రయంలో కొత్త పద్ధతిలో కరెన్సీ తరలింపును అధికారులు కనుగొన్నారు. విదేశాల నుంచి కొత్త టెక్నిక్‌తో భారత్‌కు తరలించిన ఫారిన్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫారిన్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. 
 
ఆ సమయంలో ఓ ప్యాసింజర్ తెచ్చిన ఆహార పదార్థంపై అధికారులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో జరిగిన సోదాల్లో పోలీసులకు షాకయ్యే నిజం తెలిసింది. వేరుశెనగల్లో కరెన్సీ నోట్లను దాచిన నిజాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆపై ఆ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు భారత కరెన్సీ విలువ రూ. 45లక్షలని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments