Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (15:26 IST)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. దాణా కుంభకోణంలో ఆయనకు జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐదో గడ్డి స్కామ్‌ కేసులో దొరండ ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులు మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఫిబ్రవరి నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. మొత్తం రూ.139 కోట్లను ఆయన ట్రెజరీ నుంచి అక్రమంగా మంజూరు చేసినట్టు నిరూపితమైంది. 
 
ఈ కేసులో తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే శిక్షను పూర్తి చేశారని, అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది ప్రభాత్ కుమార్ కోరారు. అయితే, లాలూ తరపు న్యాయవాది వాదనను సీబీఐ వ్యతిరేకించినప్పటికీ కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. 
 
కాగా, ప‌శుగ్రాస కుంభ‌కోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా తేల‌గా ఐదో, తుది కేసులోనూ ఆయ‌న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవిభ‌క్త బిహార్‌లో ప్ర‌భుత్వ ట్రెజ‌రీల నుంచి అక్ర‌మంగా విత్‌డ్రాయ‌ల్స్ జ‌రిగిన ఈ కేసులో రూ 950 కోట్లు చేతులు మారాయి. 
 
ప‌శుగ్రాస కేసుల్లో లాలూ ప్ర‌సాద్‌కు 14 ఏండ్ల జైలు శిక్ష‌, రూ.60 ల‌క్ష‌ల జ‌రిమానా విధించ‌గా నాలుగు కేసుల్లో ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది. 1996లో ప‌శుగ్రాస కేసు వెలుగుచూడ‌గా జూన్ 1997లో లాలూను సీబీఐ నిందితుడిగా చేర్చింది. లాలూతో పాటు బిహార్ మాజీ సీఎం జ‌గ‌న్నాధ్ మిశ్రాల‌పై సీబీఐ అభియోగాలు న‌మోదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments