కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈయనకు దాణా స్కామ్ ఐదో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఐదేళ్ళ జైలుశిక్షతో పాటు 60 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ఆయన్ను జైలుకు తరలించారు.
అయితే, ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని రాజేంద్ర సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ ఆస్పత్రికి తరలించి అడ్మిట్ చేశారు. లాలూ ఆరోగ్యంపై ఆయన స్పందిస్తూ, తీవ్ర అస్వస్థతతో ఆయన ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.