Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాణా కేసు: లాలూ ప్రసాద్‌కు మూడున్నరేళ్ల జైలు.. నో-బెయిల్

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్‌కు‌ జైలు శిక్ష ఖరారైంది. ఈ మేరకు రాంచీ సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూతో పాటు ఏ

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (16:37 IST)
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్‌కు‌ జైలు శిక్ష ఖరారైంది. ఈ మేరకు రాంచీ సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూతో పాటు ఏడుగురు నిందితులకు కూడా ఇదే శిక్షను ఖరారు చేసింది. అంతేగాకుండా రూ.5లక్షల జరిమానా కూడా విధించింది. మూడేళ్లు జైలు దాటడంతో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 
 
దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసులో దోషుల‌కు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో లాలూతో పాటు 15 మందిని రాంచీ సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. కొన్ని రోజుల పాటు కస్టడీలో వున్న వీరంతా.. ప్ర‌స్తుతం బిర్సా మండా సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్జి శనివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శిక్ష‌ ఖ‌రారు చేశారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments