Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

35 ఏళ్ల ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చింది... లింగరాజు పాణిగ్రాహి

అమరావతి: 35 ఏళ్ల ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి తెలిపారు. ఉద్యోగ విమరణ సందర్భంగా సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహిని సచివ

35 ఏళ్ల ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చింది... లింగరాజు పాణిగ్రాహి
, శుక్రవారం, 29 డిశెంబరు 2017 (17:44 IST)
అమరావతి: 35 ఏళ్ల ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి తెలిపారు. ఉద్యోగ విమరణ సందర్భంగా సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహిని సచివాలయ సాధారణ పరిపాలన, ఇతర శాఖల ఉద్యోగులు ఆయనను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి మాట్లాడుతూ, నిబద్ధత కలిగిన ఉద్యోగులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 
 
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన సచివాలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత సచివాలయం ఏపీలో ఉందన్నారు. ఉద్యోగులంతా ఇష్టపడి, కష్టపడి పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించడం ఎంత ముఖ్యమో మంచి ఆరోగ్యం కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి తెలిపారు. 
 
సీఎం చంద్రబాబు నాయుడు భవిష్యత్ తరాల అభ్యున్నతికి ముందుచూపుతో పనిచేస్తున్నారన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం తనకు సంతోషం కలిగిస్తోందన్నారు. 35 ఏళ్ల నాలుగు నెలల ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందని, సంతోషంగా వెళుతున్నానని అన్నారు. ప్రస్తుత పొలిటిక్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ విశ్వకర్మలా పనిచేస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో తనకు చేదోడువాదోడుగా ఉన్నవారిందరికీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
పొలిటికల్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, సుదీర్ఘ పరిపాలన అనుభవం కలిగిన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహితో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు. సచివాలయ భవన నిర్మాణంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. సెక్రటరీ సర్వీసెస్ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ పి.కె.సారంగి మాట్లాడుతూ, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి సేవలను కొనియాడారు. అంతకుముందు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహిని పొలిటికల్ సెక్రటరీ నాగులాపల్లి శ్రీకాంత్, సెక్రటరీ సర్వీసెస్ గోపాలకృష్ణ దివ్వేది, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ పి.కె.సారంగితో పాటు పలువురు ఉద్యోగులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 31 రాత్రి నుంచి జూబ్లీహిల్స్‌లో స్మార్ట్ రోబో పోలీస్- దేశంలో తొలి?