Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు.. ఇలా చేస్తే?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (11:39 IST)
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ విస్తుగొలిపే సంఘ‌ట‌న వెలుగు చూసింది. ఇంత‌కుముందు రోజుకు మూడు నుంచి నాలుగు కండోమ్ ప్యాకెట్లు మాత్ర‌మే అమ్ముడుపోయేవ‌ని, ఇప్పుడు స్టోర్‌లో ఒక్క కండోమ్ ప్యాకెట్ కూడా మిగ‌ల‌డం లేద‌ని ఓ మెడిక‌ల్ షాపు య‌జ‌మాని తెలిపాడు. 
 
అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్‌ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భనిరోధక సాధనాలుగా కాకుండా మత్తు పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని తేలింది. 
 
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కొంతమంది విద్యార్థులు కండోమ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. వారు కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ 10 నుంచి 12 గంటల వరకు మ‌త్తు ఉంటుంద‌ని వైద్యులు చెప్తున్నారు. 
 
కండోమ్స్‌ డిమాండ్ గణనీయంగా పెరగడంపై స్థానిక యంత్రాంగం ఆందోళన చెందింది. కాగా, ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇంకా స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం