Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూలు పిల్లలపై ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికదాడి

Advertiesment
arrest
, శుక్రవారం, 22 జులై 2022 (12:02 IST)
హైదరాబాద్ నగరంలో మరో అమానుష ఘటన జరిగింది. స్థానిక సంతోష్ నగర్‌లో పాఠశాలకు వెళ్లే చిన్నారులపై ఆ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మొయిన్ బాగ్‌లో ఓ ప్రైవేట్ స్కూలు ఉంది. ఈ స్కూలు మహిళా ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈమె కుమారుడు యాసర్ పాఠశాలకు వచ్చే చిన్నపిల్లలపై లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ప్రిన్సిపాల్ తన తల్లి కావడంతో చిన్నారులను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ తంతు చాలా కాలంగా జరుగుతూ వచ్చింది. అయితే, బాధిత చిన్నారుల్లో ఓ చిన్నారి తాను ఎదుర్కొన్న పరిస్థితిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఐపీసీ 354(ఏ), 209, 9(ఎం), ఫోక్సో చట్టం 2012 నుంచి కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ నిందితుడి నుంచి న్యూడ్ వీడియాలను స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేది లేదు.. టీఎంసీ ఎంపీ క్లారిటీ