వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నాటు సారా కాటేసింది. దీంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.
మంగళవారం రాత్రి నాటు సారా తాగిన అనేక మంది అస్వస్థతకు లోనయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో అనేక మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి వారిలో కొందరు తమ ఇంట్లోనే చనిపోయారు. విషమంగా ఉన్న వారిని హౌరా, టీఎల్ జైస్వాల్ ఆస్పత్రులకు తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అత్యంత విషమ పరిస్థితిలో 20 మంది ఆస్పత్రిలో చేరినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ కల్తీసారా విక్రయాలు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం.