ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు ఇంజనీరింగ్ విద్యార్థులు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:14 IST)
ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం కారులో బయలుదేరిన ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఆగివున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా టిప్పర్ కింద చిక్కుకునిపోయింది. దీంతో కారులోని ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన పెరుంగళత్తూరులో జరిగింది. 
 
చెన్నై ఈసీఆర్ రోడ్డులో వున్న హిందూస్థాన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అయిన వీరందరూ కలిసి సోమవారం చెన్నైలో జరగనున్న ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం శనివారం రాత్రి కారులో బయలుదేరారు. అర్థరాత్రిదాటిన తర్వాత 1.30- 2 గంటల మధ్య చెంగల్పట్టు జిల్లా పెరుంగళత్తూర్ సమీపంలో ఆగి ఉన్న టిప్పర్ లారీని వీరి కారు ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంసం కాగా, అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారి మృతదేహాలను అతి కష్టంపై బయటకు తీశారు. వీరంతా 25-30 ఏళ్ల లోపు వారేనని పేర్కొన్న పోలీసులు వారిని.. రాహుల్ కార్తికేయన్ (పుదుక్కోట), రాజాహరీష్ (మేట్టూరు), అరవింద్ శంకర్ (చెన్నై కేకే నగర్), అజయ్ (తిరుచ్చి), నవీన్ (మేట్టూర్)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments