Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా చెన్నై పర్యటనలో 7 వేల మంది పోలీసులతో భద్రత!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:28 IST)
కేంద్రం హోం మంత్రి అమిత్ షా శనివారం చెన్నై నగర పర్యటనకు రానున్నారు. వచ్చే యేడాది మే నెలలో తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తమిళనాడుపై కమలనాథులు పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించారు. 
 
ఈ ఎన్నికల్లో సత్తా చాటి, బలోపేతం కావాలనే యోచనలో కార్యాచరణను రూపొందించుకుని, ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షార్ శనివారం చెన్నై పర్యటనకు రానున్నారు. 
 
శనివారం ఉదయం చెన్నైకు చేరుకునే ఆయన... నేరుగా త్యాగరాయ నగర్‌లోని బీజేపీ రాష్ట్ర శాఖ కార్యాలయానికి వెళతారు. అక్కడ పార్టీ నేతలతో కీల సమావేశం నిర్వహిస్తారు. పార్టీ అభివృద్ధి, అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సి వ్యూహంపై చర్చిస్తారు. 
 
అనంతరం సాయంత్రం చేపాక్ కళైవానర్ అరంగంలో జరిగి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన చెన్నైలోని లీలాప్యాలెస్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. 
 
మరోవైపు, అమిత్ షా పర్యటన సందర్భంగా చెన్నైలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కమలాలయం, కళైవానర్ అరంగం, లీలాప్యాలెస్ హోటల్ వద్ద 7 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అంటె ఐదెంచల భద్రతను కల్పించారు. స్థానిక పోలీసులతో పాటు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments