Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివాసి ఇంట అమిత్ షా భోజనం.. నేలపై కూర్చుని ఆహారం తీసుకున్న నేతలు

Advertiesment
Amit Shah
, శుక్రవారం, 6 నవంబరు 2020 (13:00 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెస్ట్ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన ఓ ఆదివాసి కార్యకర్త ఇంట భోజనం చేశారు. ఆయనతో పాటు.. మిగిలిన నేతలు కూడా నేలపై కూర్చొని అన్నం ఆరగించారు. భోజనం చేసినవారిలో అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా, జాతీయ ఉపాధ్యక్షుడు ముఖుల్ రాయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్‌లు ఉన్నారు. 
 
తమ అభిమాన నేతల కోసం పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేసిన విభీషణ్, అరిటాకులో వాటిని వడ్డించగా, నేతలంతా నేలపైనే కూర్చుని భోజనం చేశారు. అన్నం, పప్పు, పటోలా భాజా, షుక్తో, ఆలూ పోస్టో, పాపడ్ తదితరాలతో పాటు రసగుల్లా, సందేశ్, మిష్టీ డోయి వంటి స్వీట్స్‌ను వడ్డించారు. అయితే, అమిత్ షా డెజర్ట్స్‌ను మాత్రం తీసుకోలేదు.
 
భోజనం అనంతరం, అమిత్ షా ఆ కార్యకర్త కుటుంబ సభ్యులను పలకరించారు. స్థానికులతో కాసేపు మాట్లాడారు. అమిత్ షా వంటి నేత తన ఇంటికి వచ్చి భోజనం చేయడం, తనకు లభించిన అదృష్టమని, ఇది తన జీవితాంతం గుర్తుండిపోతుందని వీభీషణ్ హన్సడా వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి...