Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం పూర్తయ్యింది, తెల్లారేసరికి పెళ్లి కొడుకు చనిపోయాడు, ఏమైంది?

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (18:51 IST)
వాళ్లిద్దరికీ పెళ్లి జరిగింది. జంట ఈడూజోడూ కుదిరిందనీ, చక్కగా వున్నారని అంతా చెప్పుకున్నారు. శోభనం మూడు రాత్రులు సంతోషంగా గడిచాయి. ఐతే మూడో రోజు తెల్లవారగానే పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారాడు. ఏం జరిగింది?
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకి సమీపంలో గత వారం ఓ యువతీయువకుడికి పెళ్లయింది. బంధువులందరూ పెళ్లికి విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించి వెళ్లారు. జంట చూడచక్కగా వుందని చెప్పుకున్నారు. శోభనం మూడు రాత్రులు గడిచాయి. ఐతే అకస్మాత్తుగా పెళ్లికొడుకు తెల్లారేసరికి చనిపోయాడు. అంతా లబోదిబోమని ఏడ్చారు. అతడి అంత్యక్రియలు ముగించారు. ఐతే ఈ విషయం పోలీసులకు చేరింది.
 
అనుమానం వచ్చిన పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు కోవిడ్ 19 పరీక్షలు చేయించారు. అందులో పెళ్లికుమార్తెతో సహా మరో 8 మందికి కరోనావైరస్ వున్నట్లు తేలింది. దాంతో అంతా షాకయ్యారు. కానీ పెళ్లికొడుకు చనిపోయింది కరోనాతోనా లేదా అన్నది మాత్రం తెలియలేదు. పెళ్లికి ముందు సహజంగా వధూవరులు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలి.
 
కానీ ఇతడి విషయంలో అది జరగలేదు. దాంతో అతడు కోవిడ్ కారణంగా చనిపోయి వుంటాడని అనుమానిస్తున్నారు. కాగా కరోనావైరస్ బారిన పడిన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పెళ్లింట కొత్తపెళ్లి కొడుకు చనిపోవడం, అంతా కరోనాతో ఆసుపత్రి పాలవడంతో ఆ పెళ్లికి వచ్చినవారు ఇప్పుడు కరోనావైరస్ టెస్టులు చేయించుకునేందుకు ఆసుపత్రి బాట పట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments