Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖరీదైన పెళ్లి కొడుకు, తొలిరాత్రి వధువు తలుపు తీసి చూసి షాక్...

Advertiesment
expensive groom
, గురువారం, 3 డిశెంబరు 2020 (19:36 IST)
పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ పంట పండి పిల్లాపాపలతో పది కాలాల పాటు సుఖసంతోషాలతో వుండాలని పెద్దలు దీవిస్తారు. కానీ కొన్ని పెళ్లిళ్లు పెటాకులవుతాయి. అనూహ్యంగా కొత్త జంట విడిపోతుంది. జీవిత మాధుర్యం చవిచూడకుండానే చేదుగా మిగిలిపోతుంది. బెంగళూరులో ఓ ఖరీదైన పెళ్లి జరిగింది. కానీ నెల తిరగక ముందే పెటాకులైంది. అసలేం జరిగింది?
 
బెంగళూరులోని బాణసవాడికి చెందిన బాబురెడ్డి కుమార్తె శ్రావణినిచ్చి ఎల్బీఎస్ నగర్లో వుంటున్న లోకేష్ రెడ్డి కుమారుడు భరత్ రెడ్డికి పెళ్లి చేసారు. కట్నకానుకలు లోటు లేకుండా స్థాయికి తగ్గట్లు ఓ బెంజికారు, 5 కిలోల బంగారంతో పాటు కోట్లు విలువ చేసే ఆస్తిని అల్లుడికి కట్నంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంత కట్నమిచ్చి ధూంధాంగా పెళ్లి జరిపిస్తే అల్లుడు అసలు రంగు చూసి షాక్ తిన్నారు.
 
శోభనం తొలిరేయి పెళ్లి కుమార్తె ఇంట్లో ఏర్పాటు చేయగా కొత్త పెళ్లికొడుకు పీకలదాకా తప్పతాగి వచ్చాడు. తొలిరేయి ఇలా వుంటుందని ఆమె ఊహించలేకపోయింది. నిలబడేందుకు కూడా అతడికి స్టామినా లేకుండా తూగిపోతుంటే అతడిని ఆరోజుకి దూరం పెట్టేసింది. మరుసటి రోజు శోభనం పెళ్లి కొడుకు ఇంట్లో. అక్కడ కూడా అదే సీన్.
 
విషయాన్ని తన అత్తమామల దృష్టికి తీసుకెళ్తే... తాగుబోతు కొడుక్కి సహకరించాలంటూ అతడికి వత్తాసు పలికారు. ఐనప్పటికీ ఆమె మద్యానికి బానిసైన తన భర్తను దూరం పెట్టేసింది. కోడలు ఇలా చేయడంతో ఆమెకి ఏదో గాలి సోకిందంటూ భూతవైద్యుడిని పిలిపించింది అత్త. ఈ తంతును చూసి కోడలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కట్టుకున్న భర్త ఇనుప రాడ్ తీసుకని ఆమెపై దాడి చేసాడు.
 
ఆ తర్వాత ఆమెను ఓ గదిలో బంధించేసారు. కూతురు నుంచి సమాచారం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తమ పెద్దకుమార్తెను అల్లుడిని ఏమైందో చూసిరమ్మని పంపారు. ఇంటికి వచ్చి చెల్లెల్ని చూసి అక్క కన్నీటిపర్యంతమైంది. చెల్లెల్ని వెంటబెట్టుకుని పోలీసులకి ఫిర్యాదు చేసింది. తాగుబోతు భర్తను పోలీసులు అరెస్టు చేసారు. ఆమె అత్తమామలను మాత్రం అరెస్టు చేయలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీ మరోమారు పొడగింపు!