Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా రైల్వే ఆఫీసులో అగ్నిప్రమాదం.. 9 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (10:19 IST)
కోల్‌కతా (సెంట్రల్)లోని స్ట్రాండ్ రోడ్‌లోని రైల్వే కార్యాలయ భవనంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఒక పోలీసు అధికారి, రైల్వే అధికారి, ఓ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు మృతి చెందిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. 
 
ఏడు మృతదేహాల్లో ఐదు మృతదేహాలను 12వ అంతస్థులోని ఎలివేటర్‌లో గుర్తించారు. బాధితులంతా పొగతో లిఫ్ట్‌లో ఊపిరాడక చనిపోయారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపశాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 25 ఫైర్‌ ఇంజిన్లను తరలించారు. 
 
అగ్నిమాపక మంత్రి, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎలివేటర్‌ను వినియోగించడం వల్లే విషాదం చోటు చేసుందని పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు.
 
ఈ విషయం తెలుసుకున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రాత్రి 11 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 
 
'ఇది రైల్వే ఆస్తి. రైల్వేకు బాధ్యత ఉందని, రైల్వే భవనం మ్యాన్‌ను అందించలేకపోయిందన్నారు. ఈ విషాద ఘటనపై తాను రాజకీయాలు చేయాలనుకోవడం లేదని, కానీ రైల్వే నుంచి ఎవరూ ఈ ప్రదేశానికి రాలేదు' అని పేర్కొన్నారు.
 
స్ట్రాండ్ రోడ్‌లోని హూగ్లీ నది పక్కన తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే కార్యాలయ భవనం న్యూ కోయిలాఘాట్ భవనం 13వ అంతస్తులో దుర్ఘటన జరిగింది. ఈ భవనంలో రైల్వే టికెటింగ్ కార్యాలయాలు ఉన్నాయి. 
 
కాగా, ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ నిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 
ఇదిలావుంటే, రైల్వే కార్యాలయానికి చెందిన భవనంలో అగ్ని ప్రమాదం జరగడంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ప్రమాదంపై విచారణ కోసం రైల్వేకు చెందిన నలుగురు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని నియమించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments