Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో రైతన్నల ట్రాక్టర్ ర్యాలీ.. హస్తినలో శకటాలు, ట్రాక్టర్లు

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (11:12 IST)
Farmers Rally
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరు చేస్తున్న రైతుల ఆందోళన కీలక ఘట్టానికి చేరుకుంది. రైతులంతా కిసాన్ గణతంత్ర పరేడ్‌కు సిద్ధమయ్యారు. టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించాయి. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దేశ రాజధానిలో పరేడ్‌కు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఇప్పటికే ట్రాక్టర్లతో దిల్లీకి చేరుకున్నారు. ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో రైతు సంఘాలతో ఒప్పందం చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఐదువేల ట్రాక్టర్లు, ఐదు వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో భారీ కవాతు నిర్వహించేందుకు పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ నంచి భారీ సంఖ్యలో కర్షకులు తరలివచ్చారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన వెంటనే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపుర్‌లోని దీక్షా శిబిరాల వద్ద నుంచి శకటాలు, ట్రాక్టర్లు ప్రదర్శనగా బయలుదేరనున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments