అమిత్ షా పేరుతో ఫేక్ ట్వీట్స్

Webdunia
శనివారం, 9 మే 2020 (19:46 IST)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ట్వీట్స్ ప్రచారం చేసిన పలువుర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా పేరుతో ఉన్న అఫిషీయల్ ట్విట్టర్‌ పోస్ట్ వచ్చేలా ఎడిట్ చేసి.. ఆయన ఆరోగ్యం బాగులేదంటూ దుష్ప్రచారం చేశారు.

అంతటితో ఆగకుండా.. మరికొందరు ఆయన ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఫేక్ ప్రచారం చేశారు. ఆయన బోన్ క్యాన్సర్ రావడంతోనే బయటకు కన్పించడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

అయితే ఈ ఘటనపై అమిత్ షా స్వయంగా శనివారం ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు అమిత్ షా హెల్త్‌పై వస్తున్న ట్రోల్స్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ట్రోల్స్‌పై స్పందించారు.

ఒకరి ఆరోగ్యం గురించి ఇలాంటి తప్పుడు సందేశాలను వ్యాప్తి చేస్తున్న వారి మనస్తత్వం ఏలా ఉందో అర్ధమవుతుందోని మండిపడ్డారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి పేరుతో ఫేక్ ట్వీట్స్ చేసిన నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నాకెలాంటి జబ్బు లేదు: పుకార్లపై స్పందించిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగాలేదంటూ పుకార్లు వినిపిస్తున్నాయని, వాటిని తాము ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇప్పటికే ప్రకటన చేశారు.

తాజాగా, అమిత్ షా కూడా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు.
 
దేశం కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న వేళ తాను విధి నిర్వహణలో తలమునకలుగా ఉన్నానని, ఇలాంటి రూమర్లను పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు.

రూమర్ల విషయం తనకు తెలిసినా, సదరు వ్యక్తుల వికృత మనస్తత్వానికే ఆ విషయం వదిలేశానని, అందుకే మొదట్లో స్పందించలేదని తెలిపారు. అయితే, లక్షలమంది పార్టీ కార్యకర్తలు బాధపడుతుండడంతో స్పందించక తప్పలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments