Webdunia - Bharat's app for daily news and videos

Install App

దురుసుగా ప్రవర్తించిందని కక్ష.. ఎఫ్‌బీలో అలాంటి ఫోటోలు..

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (16:30 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ ద్వారా నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర ఫోటోలు పంపుతూ వేధించాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన ఓ మహిళ తన కుటుంబంతో పాటు ఈసీఐఎల్‌లో నివాసం ఉంటుంది. 
 
ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి ద్వారా సంతోష్‌నగర్‌లోని రియాసత్‌నగర్‌కు చెందిన ఎండీ అజహర్‌ఖాన్ అనే యువకుడు ఎఫ్‌బీలో పరిచయం అయ్యాడు. అజహర్‌ఖాన్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ ద్వారా సదరు మహిళకు దగ్గరయ్యాడు. తరచూ ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఛాటింగ్ సమయంలో అజహర్‌ఖాన్‌తో దురుసుగా వ్యవహరించిందని కక్ష పెంచుకున్నాడు. 
 
ఈ ఏడాది సెప్టెంబర్ 13 తేదీ నుండి ఫేస్‌బుక్‌లో ఆమెకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపుతున్నాడు. అంతేకాదు ఇంటర్నెట్‌లోని నగ్న చిత్రాలను ఆ మహిళ ముఖాన్ని మార్పింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 
 
ఈ ఫోటోలు తీయమని అతడిని కోరినా.. ఆ వ్యక్తి పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాచకొండ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. నిందితుడు ఉపయోగించి కంప్యూటర్, మొబైల్ ఆధారంగా మంగళవారం నాడు అతడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments