Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీదే విజయం: ఎగ్జిట్ పోల్స్

గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్ ద్వారా వెల్లడి అయ్యింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌లో మొత్తం 182 స్థానాల్లో బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకోనుందని, కాంగ్రెస్ 70 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులక

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (17:52 IST)
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్ ద్వారా వెల్లడి అయ్యింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌లో మొత్తం 182 స్థానాల్లో బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకోనుందని, కాంగ్రెస్ 70 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులకు మూడు సీట్లు లభిస్తాయని తెలిసింది. సీ ఓటర్ ఎగ్జిట్ పోల్‌లో బీజేపీకి 108 స్థానాలు, కాంగ్రెస్‌కు 34 స్థానాలు దక్కుతాయని తెలిసింది. 
 
అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి 47-55, కాంగ్రెస్ 13-20, ఇతరులు-2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి.
 
ఇకపోతే.. గుజ‌రాత్‌లో అసెంబ్లీ రెండోద‌శ‌ ఎన్నిక‌ల పోలింగ్ గురువారం ముగిసింది. ఈ నెల 18న గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. గుజ‌రాత్‌లో 22 ఏళ్లుగా బీజేపీ పాల‌న ఉంది. తాజా ఎగ్జిట్ పోల్స్ ద్వారా గుజరాత్‌లో బీజేపీదే అధికారమని వెల్లడి అయ్యింది. ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో బీజేపీ గెలుస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే ద్వారా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments