Webdunia - Bharat's app for daily news and videos

Install App

9న రాష్ట్రపతికి ఆర్థిక సంఘం నివేదిక

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:34 IST)
పదిహేనవ ఆర్థిక సంఘం తన నివేదికను నవంబరు 9వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుందని తెలిపింది.

కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ నివేదికపై కూలంకషంగా చర్చించారు. నివేదికకు తుదిమెరుగులు దిద్దారు. నివేదికపై ఎన్‌కే సింగ్‌, సభ్యులు అజరు నారాయణ్‌ ఝా, అనూప్‌ సింగ్‌, అశోక్‌ లహిరి, రమేష్‌ చంద్‌ సంతకం చేశారు.

రాష్ట్రపతికి తమ నివేదిక సమర్పించడానికి కమిషన్‌ సమయం కోరిందని, అన్ని అంశాలపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత నివేదికను నవంబరు 9వ తేదీన సమర్పిస్తామని రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు ఆ ప్రకటన తెలిపింది.

కమిషన్‌ తన నివేదిక కాపీని ప్రధాని నరేంద్రమోడీకి కూడా సమర్పిస్తుందని వివరించింది. ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సిఫార్సులు నివేదికలో ఉంటాయి. ఈ నివేదికను కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటుకు సమర్పిస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలతో వివిధ స్థాయిల్లో కమిషన్‌ సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపి నివేదికను ఖరారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments