Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీకి కొత్త అధ్యక్షుడు?!

Advertiesment
వైసీపీకి కొత్త అధ్యక్షుడు?!
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:02 IST)
వైసీపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారా?.. ప్రభుత్వ బాధ్యతలతో సతమతమవుతున్న ముఖ్యమంత్రి జగన్.. పార్టీ నిర్వహణను మరొక విశ్వసపాత్రుడికి అప్పగించొలనుకుంటున్నారా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
 
పార్టీ బాధ్యతలను ఇప్పటికే వికేంద్రీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు సారధ్య బాధ్యతలు కూడా వేరోకరికి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పరిపాలన పై సీఎం జగన్ దృష్టి పెట్టడంతో ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే అవకాశం ఉందనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి.

రాజకీయంగా సీఎం జగన్ కు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా సరే పరిపాలన విషయంలో ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనేది వైఎస్ జగన్ ప్రధాన లక్ష్యం. ఎన్నికల మేనిఫెష్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాల అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.
 
కరోనా కారణంగా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సీఎం జగన్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం పరిపాలన మీద ఎక్కువగా దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.

త్వరలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను సీఎం జగన్ ఒక యువ ఎంపీకి అప్పగించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి పార్టీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ కుటుంబం నుంచి కాకుండా బయటి వారిని పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇప్పటికే జిల్లాల బాధ్యతను పార్టీలో కీలక నేతలకు అప్పగించిన జగన్.. ఇప్పుడు పార్టీ సారధ్య బాధ్యతలను కూడా అప్పగించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. తాను కేవలం సీఎంగా మాత్రమే ఉంటానని పార్టీ విషయంలో మాత్రం తన పెత్తనం ఇక ఉండదనే విధంగా సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. పరిపాలన విషయంలో ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.

కాబట్టి తాను ఈ పదవిలో ఉండనని చెప్పారట. త్వరలోనే సీఎం జగన్ దీనిపై స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. అయితే ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. దాదాపుగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక మూడు రోజులు వీక్లీ ఆఫ్