Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉఖ్రుల్ పట్టణానికి సమీపంలో భూకంపం... భూకంప లేఖినిపై 4.6గా నమోదు..

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (08:12 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ రాష్ట్రంలోని ఉఖ్రుల్ పట్ణానికి 208 కిలోమీటర్ల దూరంలో మయన్మార్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భూకంప లేఖినిపై 4.6గా నమోదైంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూమికి 120 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన రెండో భూకంపం ఇదేనని తెలిపింది. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం 1.47 గంటల సమయంలో అస్సాంలోని డిబ్రూఘర్‌కు 226 కిలోమీటర్ల దూరంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. 
 
కాకాగా, భారత భూకంప జోన్ మ్యాచ్ ప్రకారం మణిపూర్ రాష్ట్రం హై రిస్క్ సీస్మిక్ జోన్-5లో ఉంది. భౌగోళిక నిర్మాణం, స్థానం కారణంగా ఈ రాష్ట్రంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. సెప్టెంబరులో కూడా ఉఖ్రుల్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. అయితే, దీని తీవ్రత పెద్దగా లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు. అలాగే, తాజాగా భూకంపం వల్ల కలిగిన నష్టం ఇతర వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments