Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రాగన్ కంట్రీలో భారీ భూకంపం - 110 మంది మృత్యువాత

earthquake
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (08:18 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో దాదాపు 110 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చైనా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. 
 
ఈ భూకంపం చైనాలోని వాయువ్య గన్స్‌, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 
 
భూకంపం ధాటికి పలు భవనాలు నేలకూలాయి. ప్రజలు భయాందోళనతో రోడ్ల వెంట పరుగులు తీశారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్థానిక సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


నేడు ఐపీఎల్ వేలం... అంగట్లో సరకుల్లా కొనుగోలుకు 333 మంది ఆటగాళ్లు 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు మంగళవారం దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. ఈ వేలం పాటల్లో కొనుగోలు చేసేందుకు ఏకంగా 333 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇందులో విదేశీ ఆటగాళ్లు 119 మంది ఉన్నారు. ఈ వేలం పాటల కోసం దుబాయ్‌లో అన్ని ఏర్పాట్లుచేశారు. 
 
ఇటీవల భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీతో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిడ్ హెడ్, సౌతాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కోట్జీలు నేటి వేలం పాటల్లో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నారు. పైగా, వీరికి రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, ఈ వేలం పాటల్లో యాక్షనర్‌గా మల్లికా సాగర్ వ్యవహరిస్తారు. మల్లికా సాగర్ ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐపీఎల్ వేలం ప్రక్రియను స్టార్ స్పోర్ట్స్ చానెల్‌, జియో సినిమా ఓటీటీ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఆటగాళ్ల వేలం పాటలు ప్రారంభంకానున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊరగాయ కోసం వెళ్లి మహిళ బుగ్గ కొరికేసిన కామాంధుడు.. ఎక్కడ?