అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (10:00 IST)
తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో మాజీ మంత్రిని టార్గెట్ చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తంగమణి నివాసం, కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల గృహాలతోపాటు మొత్తం 69 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలకు దిగారు. 
 
గత పదేళ్ళకాలంలో మంత్రిగా కొనసాగిన తంగమణి తాను సంపాదించిన అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో భారీగా పెట్టుబడులుగా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 
 
బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ తనిఖీలు ఏకంగా 69 ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దిండిగల్, మదురైతో సహా మొత్తం 69 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. 
 
అలాగే, కర్నాటక రాష్ట్రంలోని ఐదు చోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఇప్పటికి కీలమైన పత్రాలతో పాటు.. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments