Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాలిన్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెడతా.. దురైమురుగన్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (12:05 IST)
డీఎంకే అధినేత స్టాలిన్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెడతానని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ పేర్కొన్నారు. ప్రాణాలున్నంత వరకు స్టాలిన్‌ను తన భుజాలపై మోస్తానని చెప్పుకొచ్చారు. తిరుప్పత్తూరు పర్యటనలో భాగంగా దురైమురుగన్ మాట్లాడుతూ.. కాట్పాడి సమీపంలోని ఓ కుగ్రామంలో జన్మించిన తాను ప్రస్తుతం డీఎంకే ప్రధానకార్యదర్శిని అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.
 
పార్టీలో సీనియర్‌ నేతను కావడంతో పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ తనకు ఈ పదవి కట్టబెట్టారని అన్నారు. పార్టీ సభ్యుడిగా చేరిన తొలిరోజుల్లో కరుణానిధి ఇంటికి వెళ్లిన సమయంలో స్టాలిన్‌ పాఠశాల విద్యార్థిగా ఉన్నారని, అనంతరం పార్టీలో పలు పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారని అన్నారు. 
 
తనకు కుటుంబం, ఆస్తుల కన్నా పార్టీయే ముఖ్యమని, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. డీఎంకే అధికారం చేపట్టిన వెంటనే కావేరి నీటిని పాలారు నదికి తరలించేలా సమగ్ర నీటి పథకాన్ని అమలు చేయడంతో పాటు పాలారు నది ప్రాంతాల్లో 10 చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించి నీటిని నిల్వ చేసి, రైతులకు తగినంత సాగునీరు అందిస్తామని దురైమురుగన్‌ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments