డీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ 97 ఏళ్ల వయసులో శనివారం తుదిశ్వాస విడిచారు. 1949లో అన్నాదురై ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) స్థాపించినప్పుడు అన్బళగన్ కీలకంగా వ్యవహరించారు. ఐదు దశాబ్దాలకు పైగా కరుణానిధికి కుడి భుజంలా వ్యవహరించారు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	అయితే వయస్సు మీదపడటంతో అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
									
										
								
																	
	 
	1957లో అన్బళగన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం తొమ్మిదిసార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కరుణానిధి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఇక అన్బళగన్ మరణ వార్త తెలిసిన వెంటనే డీఎంకే చీఫ్ స్టాలిన్ సహా పార్టీ నేతలందరూ కలిసి అపోలోకు చేరుకుని అంజలి ఘటించారు.
 
									
											
							                     
							
							
			        							
								
																	ప్రస్తుతం చెన్నైలోని కిల్‌పాకంలోని అన్బగళన్ నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయన్ని ఉంచారు. శనివారం సాయంత్రమే అంత్యక్రియలు జరుగుతాయి. కాగా అన్భళగన్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి  నివాళులు అర్పిస్తున్నారు.