Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో తెలుసా?

మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో తెలుసా?
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:27 IST)
గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. మార్చిలో బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మార్చిలో 12 రోజులు మూతపడనున్నాయి. ఇందులో భాగంగా మార్చి 1, మార్చి 8 ఆదివారం సెలవు వుంటుంది. మార్చి 9న సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. ఆ మరుసటి రోజే మార్చి 19న హోళీ పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు వుంటుంది. 
 
అలాగే మార్చి 11 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.  ఇప్పటికే ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెను అధికారికంగా ప్రకటించాయి. దీంతో ఈ మూడు రోజులు కూడా బ్యాంకులు తెరుచుకోవు. సమ్మె ముగిసిన మరుసటి రోజే మార్చి 14న రెండో శనివారం ఉంటుంది. 
 
మార్చి 15న ఆదివారం. దీంతో మరో రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు. అంటే మార్చి 10న హోళీ పండుగ దగ్గర్నుంచి మార్చి 15 వరకు వరుసగా 6 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలకు బ్రేక్ పడినట్లే. దీంతో 16వ తేదీన మాత్రమే బ్యాంకులు ఓపెన్ అవుతాయి. అంతేకాదు.. మార్చి 22 ఆదివారం బ్యాంకులకు మళ్లీ సెలవు. మార్చి 25న ఉగాది పండుగ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు తెరుచుకోవు. 
 
మార్చి 28న నాలుగో శనివారం, మార్చి 29న ఆదివారం కూడా బ్యాంకులకు సెలవే. అంటే మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 12 రోజులు తెరుచుకోవు. ఒకవేళ బ్యాంకు యూనియన్లు సమ్మె విరమిస్తే 3 రోజులు తగ్గొచ్చు. అయినా 9 రోజులు బ్యాంకులకు సెలవులే. అయితే బ్యాంకు యూనియన్లు సమ్మె విరమించే పరిస్థితి కనిపించట్లేదు. ఐదేళ్లకు ఓసారి వేతనాలను పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ-వ్యాలెట్‌తో జాగ్రత్త.. ఏమరుపాటు వద్దే వద్దు.. డబ్బులు స్వాహా!