Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్.. ఎలా?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (13:12 IST)
భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంపంలో అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్ నిలిచింది. భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిసైల్స్‌ను ఒడిశా తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఒరిస్సా తీరం నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ పరీక్షతో భారత రక్షణ రంగం మరింత బలోపేతమైనట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. 
 
ఈ మిస్సైల్‌ను వివిధ రకాల పేలోడ్లను మోసుకెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. ఇది 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. ఈ విజయంతో క్రిటికల్, అడ్వాన్స్‌డ్ మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల చెంత భారత్ చేరినట్టు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇదొక చారిత్రక ఘట్టమని, ఈ విజయంతో అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
పరీక్ష అనంతరం మిసైల్ గమనాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి సేకరించిన ఫ్లైట్ డేటా.. క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు నిర్ధారించిందని డీఆర్డీవో ప్రకటించింది. ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ డీఆర్డీవో ల్యాబరేటరీస్, ఇండస్ట్రీ పార్టనర్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించారు. డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, రక్షణ దళాల అధికారుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు డీఆర్డీవో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments