Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

360 డిగ్రీల్లో రక్షణ అందించే సరికొత్త బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు.. డీఆర్డీవో

Advertiesment
bulletproof jackets

ఠాగూర్

, గురువారం, 26 సెప్టెంబరు 2024 (09:26 IST)
భారత సైనికులకు ఇచ్చేందుకు సరికొత్త, తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను భారత రక్షణ, పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) తయారు చేస్తుంది. ఇవి 360 డిగ్రీల్లో రక్షణ అందిస్తాయని రక్షణ శాఖ వెల్లడించింది. వీటిని ఢిల్లీ ఐఐటీ నిపుణులతో కలిసి తయారుచేస్తుంది. పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి తయారు చేసినట్టు వెల్లడించింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు ఏబీహెచ్‌ఈడీ (అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్ ఫర్ హైఎనర్జీ డిఫీట్) అని పేరు పెట్టినట్టు డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. 
 
ఢిల్లీలోని ఐఐటీలో డీఆర్డీవో ఇండస్ట్రీ అకాడెమీ సెంటర్ ఫర్ ఎక్స‌లెన్సీలో అభివృద్ధి చేశారు. దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని మూడు పరిశ్రమలకు బదిలీ చేసేందుకు ఈ కేంద్రం సిద్ధఁగా ఉందని రక్షణ శాఖ వెల్లడించింది. ఇవి 8.2 కేజీలు, 9.5 కేజీల బరువుతో వివిధ బీఐఎస్ ప్రమాణాల మేరకు వీటిని రూపొందించించారు. 360 డిగ్రీల రక్షణను అందించే ముందు వెనుక కవచాలు ఇవి కలిగివుంటాయి. ఈ జాకెట్లను పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి తయారు చేశారు. 
 
చైనా డ్యామ్‌తో పొంచివున్న ప్రమాదం.. భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న త్రీ గోర్జెన్ 
 
చైనా దేశం నిర్మించిన డ్యామ్‌తో పెను ప్రమాదం పొంచివుంది. చైనా దేశం త్రీ గోర్జెన్ పేరుతో అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించింది. ఇది భూ గమనాన్ని సైతం ప్రభావితం చేస్తున్న ఖగోళ, భూగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డ్యామ్ మానవాళికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలో మీటర్ల పొడవు, 181 మీటర్ల ఎత్తులో 2006లో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించిన విషయం తెల్సిందే. ఈ డ్యామ్‌ను 1994లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణం కోసం 114 పట్టణాలను, 1,680 గ్రామాలను చైనా నేల మట్టం చేశారు. ఈ డ్యామ్‌కు మూడు నదుల నుండి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యామ్‌లో నిల్వ ఉంటోంది. అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు చేరడంతో భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు అంచనా వేశారు. 
 
అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం రెండు సెంటీ మీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా పదే పదే హెచ్చరిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్దవైన మూడు అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి సమానంగా ఈ డ్యామ్ నుండి 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ డ్యామ్‌లోని నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ ర్యాలీకి పవన్ ససేమిరా... ఒంటరిగా వెళ్లి జనసేనలో చేరనున్న బాలినేని