Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఎదురుగానే బావతో ముచ్చట్లు, నవ్వులు.. అంతే... కేబుల్ వైరు తీసుకుని...

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:39 IST)
పెళ్ళయి రెండు నెలలే అయ్యింది. కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాడు. హాయిగా సాగిపోతున్న సంసారం. అయితే అనుమానం ఆ కుటుంబం మొత్తాన్ని చిధ్రం చేసింది.
 
తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా వీరాణం ఒరత్తరుపట్టికి చెందిన 26 యేళ్ళ తంగరాజ్‌కు, అదే ప్రాంతానికి చెందిన మోనిషాకు రెండునెలల క్రితం వివాహమైంది. మోనిషాకు 23 యేళ్లు. ఇద్దరూ అందంగానే ఉంటారు. భార్యను బాగా చూసుకోవాలని తల్లిదండ్రులను వదిలేసి తన సొంత పొలంలో ఉన్న పెద్ద ఇంటిలో కాపురం పెట్టాడు.
 
పొలంలో ఇల్లు.. ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు తంగరాజు. అయితే వివాహానికి మోనిషా బావ తరుణ్ రాలేదు. వివాహానికి హాజరు కాకపోవడంతో నెలక్రితం ఇంటికి వచ్చాడు. ప్రేమగా తలపై నిమురుతూ శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్ ఇచ్చాడు. బంధువే కావడంతో కొన్ని చిలిపి మాటలు, సెటైర్లు వేశాడు. ఆమె కూడా ఆ మాటలకు నవ్వులు పూయించింది. మధ్యలో కూర్చున్న భర్త తంగరాజుకి ఇది ఎంతమాత్రం నచ్చలేదు.
 
అంతే అప్పటి నుంచి తంగరాజ్‌కు భార్యపై అనుమానం పెరిగింది. ఆ అనుమానంతో ఆమెను దగ్గర కూడా కూర్చోబెట్టుకునేవాడు కాదు. ప్రతిరోజు గొడవే. తంగరాజ్ కేబుల్ ఆపరేటర్. చివరకు గొడవ ఎక్కువై నిన్న మధ్యాహ్నం భార్యను కేబుల్ వైర్లతో గొంతు బిగించి చంపేశాడు. భార్యను చంపానన్న బాధతో తను కూడా ఫ్యాన్‌కు కేబుల్ వైర్‌తో ఉరి వేసుకుని చనిపోయాడు. ఏం జరిగిందన్న విషయాన్ని సుసైడ్ లేఖలో రాశాడు తంగరాజ్. నూతన దంపతుల మృతిలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments