Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ రైళ్లు కాదు.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వండి : అఖిలేష్ యాదవ్

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:58 IST)
దేశానికి కావాల్సింది బుల్లెట్ రైళ్లు కాదనీ, సరిహద్దులను కంటికి రెప్పలా కాస్తున్న సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశానికి బుల్లెట్ రైళ్లు అవ‌స‌రం లేద‌న్నారు. కానీ, సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులతో దేశ రక్షణలో ఉండే పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాల‌న్నారు. 
 
పూల్వామా ఉగ్రదాడికి దేశ నిఘా వ్యవస్థ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. ఇలా ఎందుకు తయారవుతుందని ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబాలకు దేశం అండగా ఉందన్నారు. అన్ని పార్టీలు త‌మ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ప‌క్క‌న‌పెట్టి, సుర‌క్షితమైన స‌రిహ‌ద్దు కోసం దీర్ఘ‌కాలిక వ్యూహాన్ని ర‌చించాల‌న్నారు. 
 
అదేసమయంలో దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన తొలిరోజే సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన అనంతరం వందే భారత్ రైలులో పొగలు వచ్చాయి. కోచ్‌లలో విద్యుత్ సమస్య తలెత్తిందని తెలిపారు. 
 
బ్రేకుల్లోనూ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలతో రైలు నిలిచిపోయిందన్నారు. అభివృద్ధి అంటూ వందేభారత్ గురించి చెబుతున్నారు. దేశంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. యువతకు ఉద్యోగాల్లేవ్. భద్రతావ్యవస్థ కుప్పకూలింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందంటూ అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments