Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమానురాలిపై అత్యాచారయత్నం.. అలా కాపాడిన శునకం..

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (16:04 IST)
మనిషిని మనిషే రక్షించని ఈ కాలంలో ఒక శునకం తన యజమానురాలుని ఆపద నుండి రక్షించి కృతజ్ఞతను చాటుకుంది... ఓ పెంపుడు శునకం. తన యజమానురాలుని రక్షించడంలో తనకు కత్తిపోటు తగిలినా, రక్తస్రావం అవుతున్నా పట్టించుకోలేదు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ సమీపంలో ఉన్న చోలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చోలాకు చెందిన ఓ కుటుంబం కుక్కను పెంచుకుంటోంది. ఆదివారం మధ్యాహ్నం ఇంటి యజమాని సొంత పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో భార్య మాత్రమే ఒంటరిగా ఉండటంతో, ఓ దుండగుడు తలుపు తట్టాడు. యధావిధిగా ఆమె తలుపు తీసింది, వెంటనే దుండగుడు ఆమె నోరు మూసివేసి లోపలకి ఈడ్చుకుని వెళ్లాడు. కత్తితో బెదిరించి అత్యాచారం చేయబోయాడు.
 
ఇంట్లో నుండి గట్టిగా కేకలు వినిపించడంతో, బయట ఉన్న శునకం అప్రమత్తమైంది. పరుగున వెళ్లి అతడిపై దాడి చేసింది, ఈ క్రమంలో శునకాన్ని అతను కత్తితో పొడిచాడు. ఈలోపు మహిళ అక్కడ నుండి తప్పించుకుంది. ఆ తర్వాత దుండగుడు కూడా అక్కడ నుండి పరారయ్యాడు.

ఈ ఘటన గురించి బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం శోధిస్తున్నారు. గాయపడిన కుక్కను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు కోలుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments