Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డులో పక్షి వూపిరి పీల్చదా?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (08:44 IST)
పక్షుల గుడ్లపై ఉండే పెంకు (shell)గాలి ప్రవేశించడానికి అడ్డంకి కాదు. దాంట్లో మన కంటికి కనబడని అతి సన్నని రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా వాయువులు లోపలికి, వెలుపలకు వ్యాపిస్తూనే ఉంటాయి.

గుడ్లలో ఉండే పక్షి పిల్లల పిండాలకు వూపిరితిత్తులంటూ ఏమీ ఉండవు. కానీ ఆ పిండాన్ని అంటుకొని పెరుగుతూ ఉండే ఆంత్రం (పేగు)కు అనుసంధానమై 'ఎలనాటిస్‌' (Allanotis)అనే పలుచని పొర ఉంటుంది.

ఈ పొర ద్వారానే పక్షి పిండం శ్వాసిస్తుంది. ఈ పొర టమోటా సాస్‌లాగా ఒక మడతపై మరొకటి పరుచుకొని వలలోని అల్లికలాగా సున్నితమైన రక్తనాళాలు కలిగి ఉంటుంది.

వాతావరణంలోని ఆక్సిజన్‌ ఈ రక్తనాళాల ద్వారా వెలుపల నుండి గుడ్డులోకి ప్రవేశిస్తుంది. అలాగే లోపల నుండి కార్బన్‌ డై ఆక్సైడ్‌ వెలుపలికి పోతుంది. 
 
ఈ 'ఎలనాటిస్‌', సృష్టి ఆరంభంలో ప్రాణులు సముద్రాల నుండి భూమిపైకి వచ్చి రూపాంతరం చెందడంతో ప్రముఖ పాత్ర వహించింది. చేపలు, ఉభయచరాలైన కప్పల వంటి ప్రాణుల గుడ్లలో ఇది ఉండదు.

కాని పక్షులు, పాకుడు జంతువులైన పాముల గుడ్లలో ఉంటుంది. పాలిచ్చే ప్రాణులు, ముఖ్యంగా మానవులలో ఈ ఎలనాటిస్‌ బొడ్డుతాడు (Umbilical cord) రూపంలో వృద్ధి చేందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments