శ్రావణమాసంలో ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శ్రావణమాసం మాంసాహారం, మద్యం సేవించడం తగదు. వంకాయ కూర తినకూడదు. పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని సమాచారం. అందువల్ల శ్రావణ మాసంలో దాన్ని తినకూడదని అంటారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజులలో వంకాయ తినని వాళ్ళు చాలామది ఉన్నారు.
శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు. కానీ, పాలను పానీయంగా తీసుకోకూడదు. శివపూజ చేసేవారు రోజూ ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి.
సూర్యుడు రాకముందే నిద్రలేవడం మంచిది. శివపూజకి ముఖ్యంగా శివుడి అభిషేకానికి పసుపు ఉపయోగించరాదు. చాలామంది ఇది మర్చిపోతుంటారు. కానీ, పసుపు అభిషేకానికి వాడవద్దు. ఈ పవిత్ర మాసంలో మీ మనసు పవిత్రంగా ఉంచుకునేందుకు మీ ఇంటిని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. అన్ని విషయాల్లో సంయమనంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
శ్రావణంలో తీసుకోకూడనివి
అల్లం, వెల్లుల్లి
కారం, చాక్లెట్లు
రాక్ సాల్ట్
సొరకాయ
బంగాళ దుంప
సగ్గుబియ్యం.