Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు వాట్సాప్‌లో ఫోటో పంపింది.. డాక్టర్ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎందుకు?

దసరా ఉత్సవాలతో పాటు పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. పెద్దల కుదిర్చిన అమ్మాయిని ఇంకా రెండు రోజుల్లో పెళ్లాడనున్నాననే సంతోషంలో వున్న డాక్టర్ వరుడికి ఓ దిమ్మదిరిగే వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఆ మెసేజ్

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (17:39 IST)
దసరా ఉత్సవాలతో పాటు పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. పెద్దల కుదిర్చిన అమ్మాయిని ఇంకా రెండు రోజుల్లో పెళ్లాడనున్నాననే సంతోషంలో వున్న డాక్టర్ వరుడికి ఓ దిమ్మదిరిగే వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి షాకైన డాక్టర్.. నేరుగా గదిలోకెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. డాక్టర్ హితేష్ శర్మ ఇండోర్‌లో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. స్థానికంగా ఓ క్లినిక్ కూడా పెట్టుకున్నాడు. మంచి పేరు కూడా సంపాదించాడు. ఈ నేపథ్యంలో భోపాల్‌కు చెందిన అమ్మాయితో అతనికి నిశ్చితార్థం పూర్తయ్యింది. ఇక పెళ్లికి రెండు రోజులు వున్నాయనగా ఇంట్లో సందడి నెలకొంది. పెద్దలంతా పెళ్లి పనుల్లో హడావుడిగా వున్నారు.
 
ఇంతలో డాక్టర్ హితేష్ శర్మకు తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నుంచి ఓ వాట్సాప్‌లో ఫోటో పంపింది. ఆ ఫోటో చూసి హితేష్ షాక్ అయ్యాడు. తనతో పాటు జీవితాన్ని పంచుకుంటుందనుకున్న అమ్మాయి.. వేరే యువకుడిని వివాహం చేసుకుని.. అతనితో కలిసి తీసిన ఫోటోను పంపింది. దానికింద ఇతనే తన భర్త అంటూ రాసింది. దీంతో ఏం చేయాలో తోచక హితేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
తన బిడ్డ అవమానంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. పెళ్లి కూతురు, ఆమె కుటుంబీకులపై తగిన చర్యలు తీసుకోవాలని.. హితేష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇండోర్ విజ‌య్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments