Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్ట్ ట్రంప్ నోట డెస్పాసిటో పాట.. వీడియో చూడండి..

నెటిజన్ మాయాజాలంతో డెస్పాసిటో పాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ పాలనపై సోషల్ మీడియాలో వివిధ రకాలైన పోస్టులు మీమ్స్ వస్తుండటం పరిపాటి. అయితే నెటిజన్లు ఒకడుగు ముందుకేస

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (16:58 IST)
నెటిజన్ మాయాజాలంతో డెస్పాసిటో పాట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ పాలనపై సోషల్ మీడియాలో వివిధ రకాలైన పోస్టులు మీమ్స్ వస్తుండటం పరిపాటి. అయితే నెటిజన్లు ఒకడుగు ముందుకేసి ఆతని నోట బాగా ఫేమస్ అయిన డెస్పాసిటో పాట పాడించారు.

వివరాల్లోకి వెళితే.. స్పానిష్ భాషలో లూయిస్ ఫొన్సీ, డాడీ యాంకీలు విడుదల చేసిన డెస్పాసిటో పాట యూట్యూబ్‌లో చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట అత్యధికులు వీక్షించిన పాటగా రికార్డు కూడా సాధించింది. 
 
ఈ పాటకు సంబంధించిన కవర్ వెర్షన్లు ఎన్నొచ్చినా.. అవి కూడా యూట్యూబ్‌లో హిట్ అయ్యాయి. తాజాగా ఇదే బాట‌లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ''డెస్పాసిటో'' పాట పాడిన వెర్ష‌న్ కూడా ఇటీవ‌ల యూట్యూబ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ఈ పాట పాడలేదు. అయితే ఎవ‌రో ఔత్సాహిక నెటిజ‌న్ ట్రంప్ ప్ర‌సంగాన్ని ''డెస్పాసిటో'' పాట ప‌దాల‌కు స‌రిగ్గా స‌రిపోయేలా ఎడిట్ చేసి, వీడియో పోస్ట్ చేశాడు. 
 
దీన్ని చూస్తుంటే నిజంగా ట్రంప్ పాట పాడాడా? అనే అనుమానం త‌ప్ప‌క క‌లుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 26,052 మంది వీక్షించారు. మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments