Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావురాళ్లకు మేత వేయొద్దు

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:48 IST)
రెట్టలతో చారిత్రక కట్టడాలు పాడవుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెరుగుతున్న పావురాల సంఖ్య ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని జీహెచ్ ఎంసీ అధికారులు చెపుతున్నారు.

వాటి వల్ల మనుషుల్లో శ్వాసకోస వ్యాధులు తలెత్తే అవకాశముందని, వాటికి మేత వేయొద్దని సూచిస్తున్నారు. పావురాల రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఫలితంగా మనుషుల అనారోగ్యానికి గురవుతున్నారని చెపుతున్నారు. 
 
పలు బహుళ అంతస్తుల భవనాల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లు, దుకాణాలు ముఖ్యంగా ఆహార పదార్థాలు అమ్మే వారు వీటికి మేత వేయవద్దని చెపుతున్నారు. ఈ మేరకు జీహెచ్ ఎంసీ ఈరోజు మీడియా ప్రకటన చేసింది.
 
 కాగా, నగరంలో ఉన్న హార్టీ కల్చర్ పార్కుల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్ని జీహెచ్ ఎంసీ ఇప్పటికే నిషేధించింది. మరోవైపు మొజాంజాహి మార్కెట్లో పావురాలకు దాణాగా వేసే జొన్నలు, ఇతర  తృణ ధాన్యాలను జీహెచ్ ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పావురాల రెట్టలతో చారిత్రక కట్టడాలు పాడవుతుండడంతో, ఇటీవల మొజాంజాహి మార్కెట్లో 500 పావురాలను పట్టి శ్రీశైలం అడవుల్లో వాటిని విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments