Webdunia - Bharat's app for daily news and videos

Install App

కప్పల జంటకు విడాకులు

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (08:29 IST)
సాధారణంగా వర్షాలు కురవడం కోసం పల్లెటూళ్లలో కప్పలకు పెళ్లి చేసే వారు.. అదే విపరీతంగా వర్షాలు కురుస్తే..? వరదలు వస్తే ఏమి చేయాలి? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మాత్రం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వెళ్లాల్సిందే.

గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భోపాల్ లో కూడా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయింది. అయితే అంతకంటే ముందు వర్షాలు పడటం లేదన్న కారణంతో భోపాల్‌ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు.

ఆ తరువాత వాతావరణం అనుకూలించడంతో విపరీతంగా వర్షాలు కురిశాయి. దాంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో వానలు ఆగాలని ఒక విచిత్ర ప్రయత్నం చేశారు. వానలు పడటం కోసం ఏ కప్పలకైతే పెళ్లి చేశారో.. అదే కప్పల జంటకు విడాకులు ఇప్పించారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. మంగళవారం ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

ఈ విడాకుల ప్రక్రియను పలువురు పెద్దల సమక్షంలో నిర్వహించారు. భోపాల్ పట్టణం ఇంద్రపురి ప్రాంతానికి చెందిన శివ్‌ సేవా శక్తి మండల్‌ సభ్యులు పెళ్లి చేసిన కప్పలను విడాకుల పేరుతో విడదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments