Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికపై సామూహిక అత్యాచారం.. అర కిలోమీటరు బట్టల్లేకుండా పరుగులు

Advertiesment
బాలికపై సామూహిక అత్యాచారం.. అర కిలోమీటరు బట్టల్లేకుండా పరుగులు
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:08 IST)
జైపూర్‌లో ఘోరం జరిగింది. గుడికి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ భిల్వారా జిల్లాలో 15 ఏళ్ల బాలిక ఇద్దరు స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్లింది. ముగ్గురూ చక్కగా దర్శనం చేసుకున్నారు. కాసేపు గుడి దగ్గర కూర్చొని... సరదాగా మాట్లాడుకున్నారు. తర్వాత తిరుగు ప్రయాణం మొదలైంది.
 
ముగ్గురూ అలా నడుస్తూ వెళ్తుంటే... కైలాశ్ కహర్, నారాయణ్ గుజ్జర్, రాజు కహర్ వాళ్లను చూశారు. ఈ ముగ్గురు ఆ ముగ్గురమ్మాయిలపై కన్నేశారు. వెంటపడ్డారు. అయితే ముగ్గురమ్మాయిల్లో ఇద్దరమ్మాయిలు పారిపోగా.. ఒక బాలిక మాత్రం ఆ కామాంధులకు చిక్కింది. ఆ కేటుగాళ్లను ఆమెను పట్టుకొని నోరు నొక్కి ఎత్తుకుపోయారు. నిర్మానుష్య ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పారిపోయిన అమ్మాయిలు దగ్గర్లోని షాపు వద్దకు వెళ్లి విషయం చెప్పారు. ఆ షాప్ ఓనర్ బాలికను కాపాడేందుకు వేగంగా బయల్దేరాడు. అప్పటికే ఆమెను గ్యాంగ్ రేప్ చేసిన కేటుగాళ్లు... షాప్ ఓనర్ రావడాన్ని చూసి పారిపోయారు. కానీ ఒంటిపై బట్టలు లేని స్థితిలో వున్న ఆ బాలిక షాపు ఓనర్‌ని చూసి అతను కూడా రేప్ చేస్తాడని భయపడి.. నగ్నంగా రోడ్డుపై పరుగు పెట్టింది. 
 
ఆమెను ఆపేందుకు ప్రయత్నిస్తూ... అతను కూడా పరుగుపెట్టాడు. దాదాపు అరకిలోమీటర్ బట్టలు లేకుండానే పరిగెత్తిన ఆ బాలిక ఎట్టకేలకు అతనికి చిక్కింది. ఆమెకు అసలు విషయం చెప్పి.. ఆమెను కాపాడాడు. ఆపై కుటుంబ సభ్యులకు అప్పగించాడు. బాధిత బాలిక విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేశ్ నిమజ్జనం.. అప్పుడు 2 రోజులు.. ప్రస్తుతం ఒకరోజే..