Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూగ బాలికపై కామాంధుల అకృత్యం... కేకలు వేయలేకపోయింది.. కళ్ల నుంచి నీళ్లు..

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (15:03 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా రెచ్చిపోతున్నారు. దివ్యాంగురాలిపై కామాంధుల కళ్లు పడింది. మాయ మాటలతో ఓ మైనర్ అబ్బాయి చెప్పిన మాటలను నమ్మిన మైనర్ బాలిక... ఐదుగురు కామాంధుల చేతిలో నలిగిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  
 
మైనర్ అబ్బాయి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా మాట్లాడుకుంటూ ఊరు బయట ఉన్న ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారమే ఆ బాలుడిని పంపించిన వాళ్లు అతడితో పాటు అక్కడ మరో ఐదుగురు ఉన్నారు. మొత్తం ఆరుగురు కలిసి ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. వాళ్లు ఆ పని చేస్తున్న క్రమంలో ఆమె మూగ కాబట్టి.. ఎలాంటి కేకలు వేయలేకపోయింది. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి.. తప్ప నోటి నుంచి మాట రాలేదు.. ఆమె మూగ వేదనకు వారు ఏమాత్రం కరుణించలేదు.  
 
ఎలాంటి జాలి, దయ లేకుండా ఒకరి తర్వాత ఒకరు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఇంటివద్ద వదిలేశారు. ఇలా చేసిన వారిలో నలుగురు మైనర్లు, ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిసింది. సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆ సమయంలో వీడియో, ఫోటోలు తీసి వాటిని ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. 
 
తనకు జరిగిన అన్యాయంపై బాలిక ఇంట్లో చెప్పుకోలేపోయింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు వెలుగుచూడటంతో విషయం తండ్రికి తెలిసింది. తర్వాత ఆమె ఏం జరిగిందని కుటుంబసభ్యులు గట్టిగా అడగడంతో జరిగిన దారుణాన్ని వాళ్లకు సైగలతో చెప్పుకుంటూ బోరున విలపించింది. అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని స్థానిక జిల్లా ఎస్పీ అవధేష్ గోస్వామి మీడియాకు చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం