Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశిథరూర్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారా?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ తిలోత్తమ ముఖర్జీ, సునందా పుష్కర్‌లనూ గతంలో పెళ్లాడారు. సునంద అనుమానాస్పద మరణం కేసులో థరూర్ పేరును ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో శశిథరూ

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (16:41 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ తిలోత్తమ ముఖర్జీ, సునందా పుష్కర్‌లనూ గతంలో పెళ్లాడారు. సునంద అనుమానాస్పద మరణం కేసులో థరూర్ పేరును ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహ్ర్‌తరార్‌ను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నట్లు సీఎన్ఎన్ న్యూస్ 18 పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
 
అయితే ఇది సదరు టీవీ చానెల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కాదని తేలింది. కేవలం శశిథరూర్, తరార్‌ల వివాహంపై వార్త రాగానే ముందువెనుక చూసుకోకుండా 66 మంది ఫాలోకావడం మొదలుపెట్టారు. ఈ ట్వీట్ ఇంటర్నెట్‌లోనూ వైరల్‌గా మారింది. చివరికి మెహ్ర్ ఈ వ్యవహారంపై స్పందించారు. 
 
ఈ వ్యవహారంలో ఓ పేరడీ అకౌంట్లో వచ్చిన తప్పుడు కథనానికి ఎలా నమ్మేస్తారంటూ ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితమే ప్రారంభించిన ఈ అకౌంట్‌కు కేవలం 66 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రజలు నమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని ట్వీట్ చేశారు. దీంతో కేసులు పడొచ్చని భయపడ్డ సదరు ట్విట్టర్ అకౌంట్ యూజర్ తనది కేవలం పేరడీ ఛానల్ మాత్రమేనని స్పష్టం చేశాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments