సునంద పుష్కర్ కేసు : శశిథరూర్‌ను విచారించాలి.. పిలిపించండి : ఢిల్లీ కోర్టు
సునంద పుష్కర్ ఆత్మహత్య కేసు కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరపాల్సివుందని, అందువల్ల కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ ఢిల్లీ కోర్
సునంద పుష్కర్ ఆత్మహత్య కేసు కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరపాల్సివుందని, అందువల్ల కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ ఢిల్లీ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఢిల్లీ కోర్టు ఆయనకు సమన్లు జారీచేసింది. ఈనెల 7వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా ఆ సమన్లలో పేర్కొన్నారు.
థరూర్‌పై విచారణ జరపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్ముతున్నట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ చెప్పారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి.
చార్జిషీటును మొత్తం పరిశీలించాను. పోలీసులు పెట్టిన ఐపీసీ సెక్షన్ 306, 498 ఎ కేసుల ప్రకారం సునంద పుష్కర్‌ను థరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధించిన నేరాల కింద ఆయనను విచారించాలని నిర్ణయించినట్లు జడ్జి చెప్పారు. ఈ సెక్షన్ల కింద థరూర్‌ను విచారించేందుకు ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.