Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మురికి వాడ పరిశుభ్రం.. అయినా 33 కరోనా కేసులు

Webdunia
గురువారం, 14 మే 2020 (18:57 IST)
ధారావిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ధారావిలో మరో 33 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కరోనా మహమ్మారి గత నెల మొదటి వారంలో 10 కేసులతో మొదలై ఆ తర్వాత వేగంగా విస్తరించింది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
ముంబై మురికి వాడను పూర్తిగా పరిశుభ్రం చేశారు. అన్ని ఇళ్లలో శానిటైజింగ్ నిర్వహించారు. బాధితులను గుర్తించి క్వారెంటైన్‌కు తరలించారు. అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. గురువారం నమోదైన 33 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. కాగా, గురువారం ధారావిలో కొత్తగా రెండు మరణాలు కూడా సంభవించాయి.
 
మరోవైపు కరోనా వేగంతో దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి‌. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. టెస్టింగ్‌ సామర్థం పెరగడంతో పాటు వైరస్‌ సోకే వారి సంఖ్య కూడా పెరిగింది. వలస కార్మికుల రాకతో రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డవుతున్నాయి‌.
 
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3వేల 722 కొత్త కేసులు నమోదయ్యాయి‌. 134 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78 వేల మార్కుకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments