Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా స్టీల్ మేనేజర్ కాల్చివేత... ఉద్యోగం ఇవ్వలేదనీ ఉసురుతీశాడు..

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (07:27 IST)
టాటా స్టీల్ సీనియర్ మేనేజర్‌ను ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు కాల్చి చంపారు. తీసేసిన ఉద్యోగం మళ్లీ ఇవ్వడం లేదన్న అక్కసుతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని హార్డ్‌వేర్ చౌక్‌లోని టాటా కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విశ్వాస్ పాండే అనే ఇంజనీర్ టాటా స్టీల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తూ వచ్చాడు. అయితే, అతని క్రమశిక్షణసరిగా లేదని ఉద్యోగం నుంచి అతడిని తొలగించారు. తర్వాత పలుమార్లు అతడు కార్యాలయానికి వచ్చి సీనియర్ మేనేజర్ అరిందం పాల్‌ను తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. కానీ, ఆయన వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందనరాలేదు. 
 
ఈ క్రమంలో చేతిలో పిస్టల్‌తో అతడు కార్యాలయంలోకి చొరబడి... తన క్యాబిన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న అరిందంపై ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో మేనేజర్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత పాండే అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments