Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ కీచకుడు : మహిళా కానిస్టేబుల్స్ కళ్లెదుటే మహిళా ఖైదీపై రైలు బాత్రూమ్‌లో రేప్...

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (10:58 IST)
ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కీచకుడిగా మారిపోయాడు. పక్కనే ఇద్దరు సహచర మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయాడు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు పక్కనే ఉన్నప్పటికీ ఓ మహిళా ఖైదీపై రైలు బాత్రూంలో అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 42 యేళ్ళ మహిళ ఓ కేసులో అరెస్టు అయి ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. అయితే ఆమెను ముర్షీదాబాద్ కోర్టు (బెంగాల్ రాష్ట్రం)లో పరిచేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళతో పాటు ఓ పురుష కానిస్టేబుల్ బందోబస్తుగా నియమించారు. 
 
దీంతో ఆ మహిళా ఖైదీని గట్టిబందోబస్తు మధ్య ముర్షీదాబాద్ కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరిచారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి రైలులో బయలుదేరారు. ఈ క్రమంలో ఆ మహిళా ఖైదీపై కన్నేసిన కానిస్టేబుల్ ఆమె బాత్రూముకు వెళ్లిన సమయంలో మహిళా సిబ్బందిని వెనక్కి పంపి అతడు టాయిలెట్‌లో జొరబడి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జైలుకు వెళ్లాక కానిస్టేబుల్ అఘాయిత్యాన్ని బాధితురాలు జైలు సూపరింటెండెంట్‌కు, జైలు వైద్యుడికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments