Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడు భార్యను పెళ్లి చేసుకునేందుకు... ఏం చేశాడో తెలుసా?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (13:50 IST)
వారిద్దరూ మంచి స్నేహితులు. ఈ క్రమంలో స్నేహితుడి భార్యపై మరో ఫ్రెండ్ మనసుపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, తన స్నేహితుడైన ఆమె భర్త అడ్డు ఉన్నంతకాలం తన కోర్కె నెరవేరదని భావించాడు. అందుకే అడ్డుగా ఉన్న తన స్నేహితుడుని చంపేశాడు. ఆ తర్వాత పోలీసుకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన గుల్కేష్, దల్బీర్ (30) అనే వ్యక్తులిద్దరూ మంచి స్నేహితులు. వీరిలో దల్బీర్‌కు వివాహమైంది. ఈమెపై గుల్కేష్ మనసుపడ్డారు. ఆమె కూడా గుల్కేష్‌ను ఇష్టపడటంతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. 
 
అయితే, ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించిన గుల్కేష్... దల్బీర్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఇందులోభాగంగా, ఈనెల 24, 25 తేదీల్లో దల్బీర్‌ను ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి రామా రోడ్డు, ప్రేమ్ నగర్ పాతక్ రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లారు. అక్కడ దల్బీర్‌ను హత్య చేసిన గుల్కేష్ మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేసి వచ్చాడు. 
 
ఆ తర్వాత పోలీసులు సమాచారం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి ఆరా తీయగా, మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుల్కేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దల్బీర్ భార్యను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పనికి పాల్పడినట్టు వెల్లడించారు. దీంతో అతనిపై హత్యా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments