Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 1 May 2025
webdunia

క్లీవేజ్ షో చేసిన అక్కినేని వారింటి కోడలు.. తోటి హీరోయిన్స్ ఏమన్నారంటే?

Advertiesment
Samantha
, బుధవారం, 26 జూన్ 2019 (12:56 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లుగా కొనసాగుతున్న వారిలో సమంత పేరు ముందుగా వినిపిస్తుంది. ముందు నుండే స్టార్ హీరోయిన్, గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న సమంత అక్కినేని వారింటి కోడలయ్యాక భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 
 
పెళ్లి తర్వాత సినిమాలు చేయడంపై కొన్నిరోజులు సందేహాలు వ్యక్తమైనప్పటికీ నాగచైతన్య భార్యగా అక్కినేని వారి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఇక అడపాదడపా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ సామాజిక మాధ్యమాలలో సందడి చేసే సమంత ఇటీవల తన క్లీవేజ్ అందాలను చూపుతూ చేసిన తాజా ఫోటో షూట్ మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.
 
వివాహం జరిగిన తర్వాత సమంతకు అవకాశాలు మరియు పాపులారిటీ మరింతగా పెరిగాయి. ఓ వైపు వరుస సినిమాలు, మరోవైపు వ్యాపార ప్రకటనలు అంటూ బాగానే సంపాదిస్తోంది. తాజాగా కాస్ట్యూమ్ డిజైనర్ కంపెనీ క్రెషా బజాజ్ కలెక్షన్స్‌ను ప్రచారం చేయడంలో భాగంగా పాల్గొన్న ఫోటో షూట్‌లో హాట్‌హాట్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.
 
ఈ ఫొటోల్లో కాస్ట్యూమ్స్ ఎంతలా అట్రాక్ట్ చేస్తున్నాయో సమంత అందాలు అంతకుమించి ప్రకాశిస్తున్నాయి. ఈ లుక్‌లో సమంతను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు, అంతేకాకుండా తోటి హీరోయిన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. రాశి ఖన్నా 'యూ ఆర్ సో ప్రెట్టీ' అని కామెంట్ చేయగా, హన్సిక ఓ ఎమోజీతో తన భావాన్ని తెలియజేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కౌసల్య కృష్ణమూర్తి" నుండి ఓ మంచి పాట