Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు ట్రిపుల్ తలాఖ్.. పారిపోయేందుకు ప్రయత్నించి వైద్యుడి అరెస్టు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (12:19 IST)
భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ వైద్యుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని కళ్యాణ్‌పురికి చెందిన 40 యేళ్ల వైద్యుడు 36 యేళ్ల భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి బెంగుళూరు నుంచి యూకేకు పారిపోయేందుకు యత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 
 
దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. నిందితుని తాను 2018లో కలిశానని, విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల పరీక్షకు సిద్ధమవుతున్న డాక్టర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ జంట గత 2020 సంవత్సరంలో వివాహం చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. వారి వివాహమైన కొన్ని నెలల తర్వాత నిందితుడు తన భార్యకు తాను కొన్ని పరీక్షలకు సిద్ధంకావాలని చెప్పి ఢిల్లీ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. 
 
వివాహమైన ఒక సంవత్సరం లోపే నిందితుడు కళ్యాణ్‌పురిలోని తూర్పు వినోద్ నగర్‌కు మారారు. భార్య లజ్‌పత్ నగర్‌లో నివాసముంది. గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన కళ్యాణ్‌పురిలోని భర్త ఇంటికి వెళ్లగా, అతడు అక్కడ మరో మహిళతో కలిసి ఉంటున్నాడని తెలుసుకుంది. భర్త తనను కొట్టాడని, తనకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యకు ఎందుకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఆమెతో కలిసి ఉండడం ఇష్టం లేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన భర్తపై ఐపీసీ 323 కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments