Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (11:13 IST)
ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను వెల్లడించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా 21 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది. 
 
మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్‌ను బరిలోకి దింపింది. గతంలో ఎంపీగా పనిచేసిన సందీప్... న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజవర్గంలో కేజీవాల్‌తో తలపడనున్నారు. ఈ స్థానంలో కేజ్రీవాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 
 
ఇక బద్దీ స్థానం నుంచి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్, బల్లిమారన్ నుంచి ఢిల్లీ మాజీ మంత్రి హరూన్ యూసుఫ్, పట్పర్ గంజ్ నుంచి ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ చౌదరి అనిల్ కుమార్, వజీర్ పూర్ నుంచి జాతీయ అధికార ప్రతినిధి రాగిణి నాయక్, ద్వారకా సీటు నుంచి ఆదర్శ్ శాస్త్రి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
 
ఈ మేరకు 21 మంది అభ్యర్థుల పేర్లకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గురువారం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఈసీ సభ్యులు అంబికా సోనీ, సల్మాన్ ఖుర్షీద్, టీఎస్ సింగ్ డియో, తదితరులు పాల్గొన్నారు. ఆ వెంటనే పార్టీ నాయకత్వం జాబితాను విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇల్లు కట్టుకున్నప్పుడు రాందేవ్ విదేశీ మొక్కలు ఇచ్చారు: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

తర్వాతి కథనం
Show comments